ఈటల రాజేందర్​పై దాడి సిగ్గుచేటు : బీజేపీ

ఈటల రాజేందర్​పై దాడి సిగ్గుచేటు : బీజేపీ

పద్మారావునగర్/ముషీరాబాద్/గండిపేట/ వికారాబాద్, వెలుగు : మునుగోడు మండలం మలివెలలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్​పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం గ్రేటర్​వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బన్సీలాల్ పేట బీజేపీ నాయకులు బోయిగూడ క్రాస్ రోడ్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో, కవాడిగూడలో కార్పొరేటర్ రచన శ్రీ ఆధ్వర్యంలో, అమీర్​పేటలో కార్పొరేటర్ సరళ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.

బీజేపీ చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, కార్పొరేటర్ సంగీత ఆధ్వర్యంలో అత్తాపూర్​​లో, శామీర్ పేట, అలియాబాద్, వికారాబాద్ పట్టణంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు.