యాదాద్రి, వెలుగు: బీసీ బంధుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు మాత్రమే అర్హులా..? అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. మంగళవారం భవనగిరి మున్సిపాలిటీ ఆఫీస్ తలుపులు మూసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి మున్సిపాలిటీల్లో 35 వార్డుల్లో బీసీ బంధు కోసం 1200 మందికి పైగా అప్లై చేసుకుంటే 600 మందిని ఎంపిక చేశారన్నారు. ఇందులో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించే వార్డులకు చెందిన వారు తప్ప.. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు వార్డులకు సంబంధించిన వ్యక్తులు లేరని ఆరోపించారు.
సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న బీజేపీ లీడర్లను విరమించాలని కోరినా ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు వారందరినీ బలవంతంగా వెహికల్లోఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్లు, కౌన్సిలర్లు నర్ల నర్సింగరావు, మాయ దశరథ, పడమటి జగన్మోహన్ రెడ్డి, ఉమాశంకర్రావు, రత్నపురం బలరాం, జనగాం కవిత, నర్సింహచారి, నల్లమాస సుమ, ఉడత భాస్కర్, వైజయంతి, మహమూద్ ఉన్నారు.