
ఆమనగల్లు, వెలుగు : భూత్పూర్ లో అక్టోబర్ 1న నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ లీడర్లు రాములు, ఆచారి కోరారు. గురువారం పట్టణంలో వారు మాట్లాడుతూ కేంద్ర పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.