ధర్మారం, వెలుగు ; వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నారని కొందరు కావాలనే ఆసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. బుధవారం ధర్మారం మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నారని, దీన్ని ఓర్వలేని నాయకులే అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఇలాంటి అసత్య ప్రచారం మానుకోకపోతే రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మెడవేని శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి సంధనవేని లక్ష్మణ్, ఎల్లాల మహేందర్ రెడ్డి, గుమ్ముల తిరుపతి, సురకంటి తిరుపతి రెడ్డి, లక్ష్మీరాజం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.