సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించేందుకు నవంబర్ 28న ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ మేరకు కరీంనగర్ లో ఈనెల 16న యాత్ర ముగింపు సందర్భంగా ఎస్ఆర్ ఆర్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కరీంనగర్ లో ఎంపీ కార్యాలయం వద్ద బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు పోస్టర్ ను రిలీజ్ చేశారు. కరీంనగర్ లో నిర్వహించే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.
కరీంనగర్ బీజేపీ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బీజేపీ నేతలు సూచించారు. కల్వకుంట్ల కుటుంబ పాలన అంతం చేయాలంటే ప్రజలందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్28న నిర్మల్‌లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అశేష జనవాహిని మధ్య కాషాయ కార్యకర్తలతో కలిసి ఆయన ముథోల్ నుంచి బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభించారు.8 అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.