రాష్ట్రంలో జరుగుతున్నవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలేనన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఖమ్మం, రామాయంపేట్ ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరారు బీజేపీ నేతలు. ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రులు, పోలీసులే ముద్దాయిలుగా ఉన్నారంటూ రఘునందన్ ఫైర్ అయ్యారు. ప్లాన్ ప్రకారమే TRS నేతలు బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు బీజేపీ నేత రామచంద్రరావు. ఖమ్మం సూసైడ్ ఘటనలో మంత్రి పువ్వాడ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, కామారెడ్డి ఘటనలలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.