పెద్దపల్లి, గోదావరిఖని, మెట్‌పల్లి, కథలాపూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు, ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పెద్దపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు సంబురాలు నిర్వహించారు. లీడర్లు రాజేశ్వర్ రావు, సత్యనారాయణరెడ్డి, ప్రమోద్, కార్తిక్, సోడా బాబు తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుల ఉమ, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు పేల్చి సంబురాలు నిర్వహించారు. మెట్‌పల్లిలో ఎంపీ అర్వింద్‌కు థ్యాంక్స్ చెబుతూ స్వీట్లు పంచిపెట్టారు. గోదావరిఖనిలో బీజేవైఎం స్టేట్ మీడియా సెల్ కన్వీనర్ కామ విజయ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. లీడర్లు రామన్న, లక్ష్మీనర్సయ్య, రవీందర్, రవీందర్ రెడ్డి, నరహరి, రాజేష్, మధు, మల్లేశ్, నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.