మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ నేతలు పర్యటించారు. గణేశ్ నగర్ 22వ వార్డ్ 143,144 బూత్ లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు గాధ మైసయ్య, శక్తికేంద్ర ఇన్ చార్జ్ ధ్యానపల్లి రామకృష్ణ, బూత్ అధ్యక్షులు రామలింగం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమంలో సామల యాదగిరి, కొక్కుల నర్సయ్య, శ్రీపతి సత్యం పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర, రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలో ఆ పార్టీ నాయకులు పర్యటించారు.
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.