ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ లెన్సీ (విహే) గురుదక్షిణ క్యాంపస్ ను బీజేపీ నేత, అంబికా దర్బార్ బత్తి అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణతో కలిసి బీజేపీ నేత దేవకి వాసుదేవ రావు సందర్శించారు.
అక్కడి క్యాంపస్ లో ఉచితంగా టైలరింగ్, డ్రైవింగ్ శిక్షణ శిబిరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విహే కార్యదర్శి చంద్రశేఖర్, బీజేపీ నేతలు చారుగుండ్ల నరసింహమూర్తి, నకిరేకంటి వీరభద్రం, వీరవెల్లి రాజేశ్, దార్ల శంకర్ గౌడ్, టీచర్లు క్రాంతి ఉపేంద్రమ్మ , తదితరులు పాల్గొన్నారు.