ఆర్మూర్​ లో .. మన్ కీ బాత్ ​లో బీజేపీ నాయకులు

 ఆర్మూర్​ లో .. మన్ కీ బాత్ ​లో బీజేపీ నాయకులు

ఆర్మూర్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్  కార్యక్రమాన్ని ఆదివారం ఆర్మూర్​ లో బీజేపీ నాయకులు వీక్షించారు. ఆర్మూర్  టౌన్​ లోని ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మన్ కీ బాత్  కార్యక్రమాన్ని చూశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ప్రధాని మోదీ ,బీజేపీతోనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. మన్ కీ బాత్ తో ప్రజలకు ప్రధాని చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేస్తున్నారని అన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా, ఆర్మూర్​ నాయకులు పాల్గొన్నారు.