ఎమ్మెల్యే వచ్చి సూసుడే తప్ప.. చేసిందేమీ లేదు

గుడిహత్నూర్, వెలుగు: భారీ వర్షాలకు గుడిహత్నూర్ మండలంలోని టాకీగూడ గ్రామ సమీపంలో బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా  ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడ్డారు. బుధవారం ఊట్నూర్‌‌‌‌-–గుడిహత్నూర్‌‌‌‌ రహదారి పై కాంగ్రెస్‌‌‌‌ ఏఐసీసీ మెంబర్‌‌‌‌ నరేశ్ ​జాదవ్, గుడిహత్నూర్‌‌‌‌ జడ్పీటీసీ బ్రహ్మానందం టాకీగూడా గ్రామస్తులతో కలిసి రాస్తారోకో చేపట్టారు.

ఎమ్మెల్యే బాపూరావు బ్రిడ్జిని పరిశీలించారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి రిపేర్లు చేపట్టలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే వచ్చి చూసుడే తప్పా.. చేసిందేమీ లేదన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్‌‌‌‌ సంధ్యారాణి, ఎంపీడీవో సునీత, పోలీసులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. ఎమ్మెల్యే, కలెక్టర్‌‌‌‌ వచ్చి స్పష్టమైన హమీ ఇచ్చేవరకు కదలమని స్పష్టం చేశారు. చివరికి ఐటీడీఏ పీవో చాహత్‌‌‌‌బాజ్‌‌‌‌ పాయ్‌‌‌‌ ఫోన్‌‌‌‌లో మాట్లాడి తక్షణమే రూ.10 లక్షల నిధులతో టెంపరరీగా రిపేర్లు చేపడతామని హమీ ఇవ్వడంతో  రాస్తారోకో విరమించారు.