తెలంగాణ రాష్ట్రంలో బీజేపోళ్లను తిరగనియ్యం : ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి

 తెలంగాణ రాష్ట్రంలో బీజేపోళ్లను తిరగనియ్యం : ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ నాయకులను తిరగనియ్యబోమని కాంగ్రెస్ వికారాబాద్​ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్​రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ వికారాబాద్​లో కాంగ్రెస్ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  తమ అగ్ర నాయకులపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పడానికి మున్ముందు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని, కార్యకర్తలందరూ  సిద్ధంగా ఉండాలన్నారు.