జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చాలా వరకు చెల్లని ఓట్లుగా తేలాయి. మొత్తంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40 శాతానికి పైగా ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ ఉంది. మొత్తం 150 డివిజన్లకు గాను.. బీజేపీకి 92 డివిజన్లలో ఆధిక్యం లభించగా.. టీఆర్ఎస్‌కు 33 డివిజన్లలో ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ 4 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా.. ఎంఐఎం 15 డివిజన్లలో ఆధిక్యం సాధించింది.
For More News..