బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాదిరిగానే.. కాంగ్రెస్‌‌‌‌ కూడా అప్పులు చేస్తోంది : ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాదిరిగానే.. కాంగ్రెస్‌‌‌‌ కూడా అప్పులు చేస్తోంది : ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి
  • బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి ఫైర్‌‌‌‌

నిజామాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాదిరిగానే రేవంత్‌‌‌‌రెడ్డి సర్కార్‌‌‌‌ కూడా అప్పుల కోసం పరుగులు పెడుతోందని బీజేపీ శానస సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి విమర్శించారు. ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నా... ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా చేయడం లేదని ఎద్దేవా చేశారు. ‘రాజ్యాంగ సంవిధాన్‌‌‌‌ గౌరవ దివస్‌‌‌‌’ అంశంపై సోమవారం నిజామాబాద్‌‌‌‌లోని పార్టీ ఆఫీస్‌‌‌‌లో నిర్వహించిన వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. 13 నెలల కాంగ్రెస్‌‌‌‌ పాలనలో 13 కుంభకోణాలు జరిగాయని, వాటిని ఆధారాలతో సహా బయటపెట్టినా స్పందించడం లేదని విమర్శించారు. 

కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు పార్టీ కోసం పనిచేస్తే... బీజేపీ నాయకులు ప్రజల కోసం పనిచేస్తారన్నారు. జిల్లాకు పసుపు బోర్డు సాధించిన ఎంపీ అర్వింద్‌‌‌‌ చరిత్రలో నిలిచిపోయారని, బోర్డు జాతీయ చైర్మన్‌‌‌‌ కూడా జిల్లా నుంచే ఎంపికకావడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్‌‌‌‌ దినేశ్‌‌‌‌ కులాచారి, జనరల్‌‌‌‌ సెక్రటరీ పోతనకర్‌‌‌‌ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.