సీఎం రేవంత్ ​పదవికి కౌంట్​డౌన్ ​మొదలైంది :మహేశ్వర్ రెడ్డి

సీఎం రేవంత్ ​పదవికి కౌంట్​డౌన్ ​మొదలైంది :మహేశ్వర్ రెడ్డి
  •  త్వరలో తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చు: బీజేఎల్పీ నేత ఏలేటి

హైదరాబాద్,వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పదవికి కౌంట్ డౌన్ మొదలైందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. త్వరలో తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చని, వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఎప్పుడైనా ఇది జరగొచ్చని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మహేశ్వర్​రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లినా ఆయనకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.  మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచి చెప్పారని, అందుకే అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉందని ఆరోపించారు. కాం గ్రెస్​లో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని, సీఎంపై ఇప్పటికే పలువురు నేతలు, మంత్రులు ఢిల్లీకి  ఫిర్యాదులు చేశారని వ్యాఖ్యానించారు.