- ఈసీకి బీజేపీ లేఖ
హైదరాబాద్, వెలుగు: వరంగల్, -ఖమ్మం-, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ రోజు (27న) సెలవు ఇవ్వాలని ఈసీని బీజేపీ కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బుధవా రం లెటర్ రాశారు. ఈ పోలింగ్‌కు 4.68 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని, వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 27న సెలవు ప్రకటించాలని కోరారు.