వామపక్ష నేతలను బీజేపీలో చేరాలని విజ్ఞప్తి చేస్తూ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బీజేపీ పార్టీ గంగానది లాంటిదని.. తమ పార్టీలో చేరితే పాపాలన్నీ తొలగి పుణ్యం వస్తుందని అన్నారు. ‘‘రైలు బోగీల్లో ఇంకా ఖాళీలున్నాయి. ఖాళీ బోగీల్లో కూర్చోండి. ప్రధాని మోడీ మనం చేరాల్సిన గమ్యానికి చేరుస్తారు' అని అన్నారు.
త్రిపురలో లెప్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది హత్యకు గురయ్యారని మాణిక్ సాహా ఆరోపించారు. ఇందుకు కాకబర్‌బన్ కూడా మినహాయింపు కాదన్నారు. కమ్యూనిస్టులు.. ప్రజల హక్కులను అణచివేసి త్రిపురను ఏళ్ల తరబడి పాలించారని ఆయన ఆరోపించారు. ఇక ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సాహా ధీమా వ్యక్తం చేశారు.