హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఫస్ట్ పార్లమెంట్‌కు పోటీ చేసేం దుకే ప్రాధాన్యత ఇస్తానని, ఒకవేళ పార్టీ అసెంబ్లీకి పోటీ చేయమంటే అందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బుధ వారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడి యాతో మాట్లాడారు. తెలంగాణలో ఎంఐ ఎం నట్లు, బోల్టులు అన్నీ కేసీఆర్ దగ్గరే ఉన్నాయన్నారు. ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని తాను అనుకోవడం
లేదన్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల ప్రభావం అంతగా లేదని, వాటికి పెద్దగా ఓటు బ్యాంకు కూడా లేదని పేర్కొన్నారు. బీబీసీ ప్రధాని మోడీ ఒక్కడినే డ్యామేజీ చేయడం లేదని, హిందూ సింబల్స్‌పై దుష్ప్రచారం, హిందూత్వంపై దాడి చేస్తున్నదని, దేశ ప్రజలకు వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తున్నదని ఆరోపించారు.