నవంబర్ 16న మూసీ ఏరియాలో బీజేపీ బస

నవంబర్ 16న మూసీ ఏరియాలో బీజేపీ బస
  • పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: మూసీ పరీవాహక ప్రాంతంలో ఆందోళనకు బీజేపీ సిద్ధమైంది. ఈ నెల16న సాయంత్రం నుంచి 17 ఉదయం వరకు  సుమారు 25 స్థలాల్లో బస చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రకాశ్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. శనివారం జరిగే మూసీ పరీవాహకంలో బస కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. దమ్ముంటే మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిద్రించాలని సీఎం రేవంత్​ చాలెంజ్​ చేశారని, దాన్ని స్వీకరించామని చెప్పారు.

మూసీ ప్రాంత ప్రజలతో ఎలా కలిసి జీవించాలో సీఎం తెలియజేస్తామన్నారు. సుమారు 25 ప్రాంతాల్లో బీజేపీ నేతల నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు.  మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూలగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ పేదల పక్షాన  పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు.. తమను తొక్కుకుంటూ వెళ్లి మూసీ ప్రక్షాళన చేయాలన్నారు.