
- ఆ పార్టీ నేతలు శిల్పారెడ్డి, గోదావరి అంజిరెడ్డి
- నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
సంగారెడ్డి టౌన్, వెలుగు : సామాన్య ఓటర్లు ఢిల్లీలో బీజేపీని గెలిపించారని అదే స్ఫూర్తితో మేధావులు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి కోరారు. గురువారం సంగారెడ్డిలోని పార్టీ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. 14న సంగారెడ్డి నియోజకవర్గానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి , ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య తరఫున ప్రచారం చేయడానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, హాజరవుతున్నారన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారన్నారు. మేధావులైన ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి బలపరచాలని కోరారు. శాసనమండలిలో మీ గొంతుకై పోరాడుతారని తెలిపారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటన్నింటినీ విస్మరించి మోసం చేసిందన్నారు.
సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పోచారం రాములు , వెంకట నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యరావు, కులుకూరి రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్, కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ పాల్గొన్నారు.