మెదక్, వెలుగు: పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశం గౌడ్ అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయ్యాక మొదటిసారిగా సోమవారం మెదక్ పట్టణానికి వచ్చి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రానున్న పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. అందరం కలసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు.
పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసినవారికి గుర్తింపు ఉంటుందన్నారు. హైకమాండ్తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అందరిని కలుపుకుపోతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. బీజేపీని బద్నాం చేయడానికి కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు ఎంఎల్ఎన్ రెడ్డి, నాయిని ప్రసాద్, బెండే వీణ, నల్లాల విజయ్ కుమార్ ఉన్నారు. ఈ సందర్బంగా మల్లేశం గౌడ్ ను ఘనంగాసన్మానించారు.