డిసెంబర్ 6న బీజేపీ బహిరంగ సభ.. కాంగ్రెస్ విజయోత్సవాలకు కౌంటర్ మీటింగ్

డిసెంబర్ 6న బీజేపీ బహిరంగ సభ.. కాంగ్రెస్ విజయోత్సవాలకు కౌంటర్ మీటింగ్
  • సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం
  • హాజరుకానున్న బీజేపీ చీఫ్ నడ్డా

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు ఏడాది విజయోత్సవాలకు కౌంటర్​గా..  బీజేపీ భారీసభను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ నెల 6న హైదరాబాద్‌‌‌‌ లో భారీ సభ పెట్టేందుకు రెడీ అయింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అటెండ్ కానున్నట్టు సమాచారం. కాగా,  దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ సభను నిర్వహించాలని భావిస్తున్నది.

ఇటీవలే ఢిల్లీలో ప్రధాని మోదీతో బీజేపీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పై పోరాటం మరింత పెంచాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో సరూర్ నగర్​లో ఈ సభను నిర్వహించి, కాంగ్రెస్ ఏడాది పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నది. 6న జరిగే సభకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ముఖ్య నేతలతో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు.