బీజేపీ మెంబర్ షిప్ క్యాంపెయిన్ వాయిదా

బీజేపీ మెంబర్ షిప్ క్యాంపెయిన్ వాయిదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన బీజేపీ మెంబర్ షిప్ క్యాంపెయిన్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడారు. గతంలో నిర్ణయించినట్టు ఈ నెల 3న స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందని, వర్షాల కారణంగా అధిష్టానం సూచన మేరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. కేంద్రం తరఫున అవసరమైన సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారని గుర్తుచేశారు.