రికార్డు స్థాయిలో బీజేపీ సభ్యత్వం : రామచంద్రరావు

రికార్డు స్థాయిలో బీజేపీ సభ్యత్వం : రామచంద్రరావు
  • బీజేపీ సభ్యత్వ తెలంగాణ ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

మధిర, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రాథమిక సభ్యత్వం రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నదని పార్టీ తెలంగాణ సభ్యత్వ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మధిర పట్టణంలో పర్యటించి సభ్యత్వాలను సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యులు ఉన్న చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని అధిగమించి 10 కోట్లకు పైగా సభ్యత్వం కలిగి ఉందని తెలిపారు. 

తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ సభ్యత్వంలో ఖమ్మం జిల్లాలోనూ రికార్డ్ స్థాయిలో సభ్యత్వం నమోదైందన్నారు. కాగా ఆయనను ఆర్యవైశ్య జిల్లా నాయకులు శాలువాతో సత్కరించారు. 

ఈ పర్యటనలో బీజేపీ  కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి,  బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ,  ఖమ్మం జిల్లా సభ్యత్వ ఇన్​చార్జ్ ఎడ్ల అశోక్ రెడ్డి , నాయకులు విజయరాజు,  ఏలూరి నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు, పాపట్ల రమేశ్, రామిశెట్టి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

ఖమ్మంలో తాండ్ర వినోద్ రావు..

ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని 26 వ డివిజన్ లో బీజేపీ నేత తాండ్ర వినోద్ రావు పర్యటిస్తూ పార్టీ అభివృద్ధి గూర్చి ప్రజలకు వివరించి సభ్యత్వం నమోదు చేయించారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి మార్థీ ప్రసాద్, వన్ టౌన్ అధ్యక్షుడు పిల్లలమర్రి వెంకట్, జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, నాయకులు రుద్ర ప్రదీప్, డీకొండ శ్యామ్ ఉన్నారు.