కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ మాకు అక్కర్లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ మాకు అక్కర్లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ తదితరులపై మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకలేని మొఖాలు ఇవాళ మేమేం చేయాలో చెప్తయా..?  కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ మాకు అక్కర్లేదని అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తోందని అన్నారు.

గవర్నర్ నిర్ణయం తీసుకోవాలంటే లీగల్ ఒపీనియన్ అనేది ఉంటుందని చెప్పారు. అమృత్ టెండర్లపై జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ తామే కోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు. ప్రజలతో తప్ప ఏ పార్టీతో బీజేపీ ములాఖత్ కాలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీరియస్ అయ్యారు.