ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైసీపీ శ్రేణులపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చేశారు. జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొస్తానని, బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఒక పెద్దమనిషి వేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read:-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భయంకరమైన చట్టం
సదరు పెద్దమనిషి ప్రతిపాదనకు కుదరదు అని బదులిచ్చానని, వాళ్ళని చేర్చుకుంటే వాళ్లు చేసిన తప్పులకి మేము బాధ్యులం అవుతామని అన్నారు. అవినాష్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని, బిజెపి టిడిపి బంధం విడదీయరానిదని అన్నారు. బిజెపితో పొత్తు కుదరటానికి తానూ, విష్ణుకుమార్ రాజు కారణమని అన్నారు. ఈరోజు ఏపీ స్థానాలే కేంద్ర అధికారానికి కారణమయ్యాయని అన్నారు.
ఆడుదాం ఆంధ్ర అనుకుంటుంటే వైసీపీ వాళ్లు అసెంబ్లీకి రావట్లేదని, మమ్మల్ని ఆడుకున్నారు కదా, మరి మేము ఆడుకోవద్దా అని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి చినరెడ్డి అయిపోయాడని, ఆయన చేసిన తప్పిదాలు ఇంకా అనేకం బయటకు వచ్చేలా ఉన్నాయని అన్నారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ సీఎం చంద్రబాబు విష్ణు కుమార్ రాజుని అడిగారని, తనను అడిగితే వాస్తవాలు చెప్పేవాడినని అన్నారు.