రన్యా రావు శరీరంలో బంగారం ఎక్కడి దాచిందో: MLA బసంగౌడ అసభ్యకర వ్యాఖ్యలు

రన్యా రావు శరీరంలో బంగారం ఎక్కడి దాచిందో: MLA బసంగౌడ అసభ్యకర వ్యాఖ్యలు

బెంగుళూరు: నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్నాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. రన్యా రావు బంగారం అక్రమ రవాణా టాపిక్ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే రన్యా రావు ఇష్యూపై కర్నాటక బీజేపీ కీలక నేత, ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు. సోమవారం (మార్చి 17) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రన్యా రావు శరీరమంతా బంగారం ఉంది. ఆమెకు బాడీలో ఉన్న అన్ని రంధ్రాల్లో గోల్డ్ దాచి పెట్టిందని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. 

అలాగే.. ఈ కేసులో కొందరి మంత్రుల ప్రమేయం ఉందని ఆరోపించారు. రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న మంత్రుల పేర్లను అసెంబ్లీ సాక్షిగా రివీల్ చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..? అక్రమ రవాణాలో ఆమెకు సహయం చేసి భద్రతా కల్పించింది ఎవరు..? అసలు బంగారం ఎలా తీసుకొచ్చింది..? ఆమె బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టింది..? ఎలా అక్రమంగా రవాణా చేసింది..? అనే దానితో సహా అన్నింటినీ అసెంబ్లీ సెషన్‌లో బయటపెడతానని పేర్కొన్నారు. రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

AALSO READ | సంతకం పెడతారా.. జైలుకెళ్తారా..? గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను టార్గెట్ చేసిన అమెరికా..

కాగా.. నటి, డీజేపీ రామచంద్ర రావు కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2025, మార్చి 3న దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తుండగా కెంపెగౌడ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రన్యా రావును డీఆర్ఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రన్యా రావు ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు రెండో భార్య కుమార్తె. రామచంద్రరావు తన మొదటి భార్య మరణించిన తర్వాత తిరిగి మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన రెండో భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు. ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు ఒకరు.