స్మార్ట్ సిటీగా మార్చకపోతే రాజీనామా చేస్తా : కందుల సంధ్యారాణి

గోదావరిఖని, వెలుగు : తనను గెలిపిస్తే 6 నెలల్లో గోదావరిఖనిని స్మార్ట్ సిటీగా మారుస్తానని, లేకపోతే రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంధ్యారాణి ఈ విషయాన్ని బాండ్‌‌ పేపర్‌‌పై రాసి చూపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ఈ మీటింగ్‌‌లో లీడర్లు గాండ్ల ధర్మపురి, సుల్వ లక్ష్మినర్సయ్య, మాతంగి రేణుక, బోడగుంట జనార్దన్‌‌, తదితరులు పాల్గొన్నారు.