సూర్యాపేట, వెలుగు: పేద ప్రజలను ఏ రోజు కూడా పట్టించుకోని మంత్రి జగదీశ్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం బీజేపీలో చేరగా.. వారికి వెంకటేశ్వర్ బీజేపీలోకి ఆహ్వానించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ని కలువడానికి ఆయన క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన సామాన్య ప్రజలను ఏనాడు కలవలేదన్నారు.
అభివృద్ధి పనుల ముసుగులో కాంట్రాక్టర్ల దగ్గర మంత్రి జగదీశ్‌రెడ్డి కోట్ల రూపాయాల్లో కమీషన్ తీసుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పాలకులు ఏనాడు కూడా పేద ప్రజల సంక్షేమ కోసం ఆలోచన చేయలేదన్నారు.