జమ్మూకశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

జమ్మూకశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

జమ్మూ కశ్మీర్  బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా(59)  కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు.  దేవేందర్ సింగ్  కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తమ్ముడు.

ఇటీవల జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్టో  దేవేందర్ సింగ్ రాణా నగ్రోటా అసెంబ్లీ నియోజవర్గ నుంచి ప్రత్యర్థి  నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి జోగిందర్ సింగ్ పై గెలుపొందారు. 

జమ్మూలోని దోడా జిల్లాలో జన్మించిన రానా ..  తన ఆటోమొబైల్ కంపెనీ, జమ్‌కాష్ వెహికిలేడ్స్‌ని స్థాపించడం ద్వారా వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు.  తరువాత జమ్‌కాష్ బైకింగ్, జమ్‌కాష్ ఫుడ్స్ , హాస్పిటాలిటీస్ .. ఇతర వ్యాపారాలను  విస్తరించాడు. రాజకీయాల్లోకి అతని ప్రస్థానం నేషనల్ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC)తో ప్రారంభమైంది. ఎన్సీలో ఉన్నప్పుడు ఒమర్ అబ్దుల్లాకు సన్నిహితంగా.. రాజకీయ సలహాదారుగా ఉండేవారు. రానా  NCకి ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.

2021 అక్టోబర్ లో  హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత  రానా NCని విడిచిపెట్టి, సుర్జిత్ సింగ్ స్లాథియాతో కలిసి BJPలో చేరారు.  

ప్రముఖుల సంతాపం

 ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ మృతిపై జమ్మూకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోసిన్హా, డిప్యూటీ సీఎం సురేందర్, పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతి తనను చాలా బాధించిందన్నారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

దేవేందర్ మృతిపట్ల అ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ముఫ్తీ కూడా సంతాపం తెలిపారు. దేవేందర్ సింగ్ ఆకస్మిక మరణ వార్త విని షాకయ్యానని అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి  తెలియజేస్తూ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.