రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందని తప్పుబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో లక్షా 91 వేల 126 ఖాళీలు ఉన్నాయని 2021లోనే పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ సర్కారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని ఈటల గుర్తుచేశారు. దేశ భవిష్యత్తులో భాగం కావాల్సిన తెలంగాణ యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ ఉద్యోగాల ఖాళీలపై ఒక రిపోర్ట్ విడుదల చేశారని, దాని ప్రకారమే లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో టీఎస్పీఎస్సీ కేవలం 31 వేల ఉద్యోగాలను మాత్రమే నింపిందన్నారు. అయితే ఆర్టీసీలో నాలుగున్నర వేల ఉద్యోగాలు నింపామని ప్రభుత్వం చెప్పిందని, ఇది పచ్చి అబద్ధమని ఈటల అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా గ్రూప్ -1, టీచర్ల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేయలేదన్నారు. రాజకీయాలపై ఉన్న సోయి కేసీఆర్ కు.. నిరుద్యోగ యువతకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడంపై లేదన్నారు. సిస్టమ్ ను కంట్రోల్ చేసే సత్తా లేక ధర్మగంట పేరుతో ఉద్యోగుల పరువు తీశాడని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తుండు
- తెలంగాణం
- February 20, 2022
లేటెస్ట్
- టూరిస్టులకు ఇండ్లలోనే నివాసం, భోజన వసతి.!..సౌలతులను బట్టి చార్జీలు
- బడ్జెట్లో ధరలు తగ్గించండి..ఉద్యోగాలు పెంచండి
- బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం
- సెమీస్‌లో యంగ్ ఇండియా..సూపర్ సిక్స్‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం
- ఇకపై డ్యామ్‌లకు ఓనర్లు.. డ్యామేజ్ జరిగితే వారిదే బాధ్యత
- కుక్కల దాడిలో 16 గొర్రెలు మృతి
- సినర్ డబుల్.. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం
- అన్నిరంగాల్లో బాలకృష్ణ విశేష సేవలు
- జనవరి 27 నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన
- జాతీయ జెండా ఎగురవేసి.. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు యత్నం
Most Read News
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి