మునుగోడులో కేసీఆర్ ప్రలోభాలకు తెరదీసిండు : ఈటల

ఉపఎన్నిక ఎక్కడ ఉంటే అక్కడ కేసీఆర్ ప్రలోభాలకు తెరదీస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కానీ మునుగోడులో కేసీఆర్ కుట్రలు పనిచేయవని.. ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో  కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలు సంతోషంగా లేరన్నారు. అంగట్లో సరుకులను కొన్నట్లుగా.. కేసీఆర్ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కొంటున్నారని విమర్శించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విపక్ష ఎమ్మెల్యేలను శాసనసభలోకి రానివ్వడం లేదన్నారు. 

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈటల అన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇలాఖాలో గిరిజనులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని.. గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి అవమానించిడం సిగ్గుచేటన్నారు. ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపుతానన్న కేసీఆర్.. వారిని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.