ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తా :  ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తా :  ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

లక్ష్మణచాంద, వెలుగు: తనను ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తానని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంతో పాటు కనకపూర్, వడ్యాల్, రాచపూర్, మల్లాపూర్, పార్ పల్లి, ధర్మారం, పీచర గ్రామాల్లో రూ.11కోట్లతో సీసీ రోడ్లు, రూ.65 లక్షలతో సంఘ భవనాల నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రస్తుతం రూ.850 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి నియోజకవర్గానికి రావాల్సిన వాటా తీసుకొస్తామని అన్నారు. నాయకులు రావుల రాంనాథ్, భూపాల్, చంద్రమోహన్ రెడ్డి, సురకంటి రెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దళితబంధు చిచ్చు

గత ప్రభుత్వం హయాంలో ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దళిత వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మండల కేంద్రంలో దళిత బంధుకు ఎంపికైన 15 కుటుంబాలను సొంత సామాజికవర్గం బహిష్కరించి వేధింపులకు గురిచేస్తోం దని బాధితులు మహేశ్వర్ రెడ్డి వద్ద వాపోయారు. సమస్య పరిష్కరించాలని విన్నవించారు.