దుబ్బాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రఘునందన్

దుబ్బాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రఘునందన్

కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తలేదని రైతులను తప్పుదోవ పట్టించొద్దని, కేంద్రంతో సీఎం కేసీఆర్‌‌కు ఏమైనా పంచాయితీ ఉంటే మోడీతో తేల్చుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. రాజకీయాల కోసం రైతులను ఆగం చేయొద్దని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మశాలి గడ్డ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు. వడ్లను కేంద్రం కొంటుందా.. రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా అనేది రైతులకు సంబంధం లేదన్నారు. ఓట్లేసి గెలిపించిన రైతులకు న్యాయం జరగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా కొనుగోలు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

అండర్‌‌ వరల్డ్‌తో నవాబ్ మాలిక్‌కు లింకులు

లిక్కర్‌‌ షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల

హుజురాబాద్ బై ఎలక్షన్‌ ఖర్చు వరల్డ్ రికార్డ్