మా పార్టీ నేతలే నన్ను జైల్లో వేయమన్నారట : ఎమ్మెల్యే రాజాసింగ్ 

మా పార్టీ నేతలే నన్ను జైల్లో వేయమన్నారట : ఎమ్మెల్యే రాజాసింగ్ 
  • కొందరు ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడుద్దామని చూస్తున్నారు: రాజాసింగ్ 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ తనపై పీడీ యాక్డ్ ప్రయోగించి జైలుకు పంపిందని.. ఆ సమయంలో తమ పార్టీకి చెందిన వారు కూడా తనను జైల్లో వేయాలని పోలీసులకు సూచించారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తనను జైలుకు పంపే సమయంలో కొందరు బీజేపీ నేతలు పోలీసులకు సపోర్ట్ గా నిలిచారని వెల్లడించారు.  ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి తనకు చెప్పినట్లు  రాజాసింగ్ వెల్లడించారు.

ఇప్పటికీ బీజేపీలోని కొందరు తనకు ఎప్పుడు వెన్నుపోటు పొడవాలా అనే ఆలోచనతోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న సమయంలో ఒక అన్న, కొందరు కార్యకర్తలు తన వెంట నిలిచారని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. తాను అన్నగా భావించిన వ్యక్తి ప్రస్తుతం ఎటువైపు ఉన్నారనేది అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కాగా..తాము అధికారంలోకి వచ్చాక పోలీసులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పడంపై రాజాసింగ్ స్పందించారు. పోలీస్ శాఖతో పెట్టుకోవద్దని కేటీఆర్ కు సూచించారు.

బీఆర్ఎస్ హయాంలో  కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి చొరబడి, బెడ్రూంలోకి చొచ్చుకొని వెళ్లి అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. అలాంటిది అయన్ను అరెస్ట్ చేసిన వారిపై సీఎం అయ్యాక కూడా రేవంత్ ఏమీ చేయలేక పోయారని తెలిపారు. పోలీసులు లీగల్ గా పనిచేస్తారనే విషయాన్ని కేటీఆర్ మరిచిపోయినట్లున్నారని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.