పరకాలలో జీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ.. గాయపడిన వారిని పరామర్శించడానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరంగల్ బయలుదేరారు. ఆయనను ఘట్‌కేసర్ పరిధిలోని అన్నోజిగూడ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీజేపీతో పాటు.. ఒక కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అల్లర్లకు దారితీశాయి. దాంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేయడంతో.. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని తగులబెట్టారు.
For More News..