బెదిరింపులు వస్తున్నయ్.. గన్ లైసెన్స్ ఇస్తరా? లేదా?

బెదిరింపులు వస్తున్నయ్.. గన్ లైసెన్స్ ఇస్తరా? లేదా?

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు పలు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. చంపేస్తామని, బాంబ్ పెడతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. ఎంఐఎంకు భయపడే డీజీపీ తనకు గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని రాజా సింగ్ పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినా కూడా డీజీపీ తనకు లైసెన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. 

‘నేరస్థులను పట్టుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతోపాటు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటారు. మరి నాకు వచ్చిన బెదిరింపు కాల్స్‌‌కు సంబంధించి నంబర్లతో సహా పూర్తి వివరాలను తీసుకుని వెళ్లి డీజీపీకి  ఫిర్యాదు చేశాను. ఆయన ఏం చేస్తారో చూడాలి. గతంలో కూడా పాకిస్తాన్, దుబాయ్ నుంచి  ఇదే మాదిరిగా బెదిరింపు కాల్స్ వస్తే డీజీపీకి ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. రాజా సింగ్‌‌కు గన్ లైసెన్స్ ఇవ్వండని సీఎం కేసీఆర్ చెప్పినా డీజీపీ ఇవ్వడం లేదు. నేను ఎమ్మెల్యే ను. బీజేపీ ఫ్లోర్ లీడర్‌‌ను. అయినా డీజీపీ నాకు గన్ లైసెన్స్ ఇవ్వడం లేదు. నాపై కేసులు ఉన్నాయని.. కేసులు ఉంటే  గన్ లైసెన్స్ ఇవ్వలేమని చెప్పారు. మరి దేశ ద్రోహి అక్బరుద్దీన్ మీద పలు కేసులు ఉన్నా ఆయనకు గన్ లైసెన్స్ ఎందుకు ఇచ్చినట్లు? ఇంకా రాష్ట్రంలో చాలా మందిపై కేసులు ఉన్నప్పటికీ డీజీపీ గన్ లైసెన్స్ ఇచ్చారు. ఎంఐఎంకు భయపడే డీజీపీ నాకు గన్ లైసెన్స్ ఇవ్వట్లేదని అనుకుంటున్న’ అని   రాజా సింగ్ పేర్కొన్నారు. 

For More News:

సామాన్యులను దహనం చేసి.. స్వామీజీలను ఎందుకు సమాధి చేస్తారంటే?

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

పోలీసుల పేర్లు మా డైరీలో రాసుకుంటాం