కరోనా వైరస్ టెస్ట్‌ల రిపోర్టులను ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇవ్వాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 48 గంటల్లో రావాల్సిన రిపోర్టు 5 రోజులైనా రాలేదంటే బాధిత కుటుంబాల్లో అయోమయం నెలకొంటుందన్నారు. తాజాగా రాజాసింగ్ కారు నడిపే ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు గన్‌మెన్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన దగ్గర పనిచేస్తున్న వారంతా భయపడుతున్నారు. ఇప్పటికే రాజాసింగ్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ నెల 20న తన దగ్గర పనిచేస్తున్న మరో ఐదుగురికి కూడా కరోనా పరీక్షలు చేయించారు రాజాసింగ్. అయితే వీరి రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 48 గంటల్లో కరోనా రిపోర్ట్ వస్తుందని చెప్పారని, తన గన్‌మెన్‌లు టెస్ట్ లు చేనయించుకొసుకొని 5 రోజులైనా ఇంకా రిజల్ట్ రాలేదన్నారు. ఇన్ని రోజులు వరకూ టెస్ట్ రిజల్ట్ రాకపోతే అయోమయం నెలకొంటుందన్నారు. ఒక వేళ పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటని, కుటుంబంలో అందరికీ వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.