16 రాష్ట్రాలు బ్యాన్ చేసిన వ్యక్తిని తెలంగాణకు ఆహ్వానిస్తారా?

16 రాష్ట్రాలు బ్యాన్ చేసిన వ్యక్తిని తెలంగాణకు ఆహ్వానిస్తారా?

హిందూ దేవుళ్ళను కించపరుస్తూ కామెడీలు చేసే మునావర్ ఫారూఖీని తెలంగాణకు వస్తే తరిమి తరిమి కొడతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఇప్పటికే మునావర్ను 16 రాష్ట్రాలు బ్యాన్ చేశాయని.. అలాంటి వ్యక్తిని జనవరి 9న  తెలంగాణ రాష్ట్రానికి రావాలని కేటీఆర్ ఆహ్వానించడమేంటని ఆయన మండిపడ్డారు.

‘తెలంగాణలో కామిడీ షో చేయాలని మునావర్ ఫారూఖీని కేటీఆర్ కోరారు. హిందూ దేవుళ్లను కించపరిచే మునావర్ ఫారూఖీనీ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఆహ్వానించాడు? కేటీఆర్ ముందే చెబుతున్నాం. హిందూ దేవతలను, దేవుళ్ళను కించపరిచే మునావర్ ఫారూఖీని తెలంగాణకు వస్తే తరిమి తరిమి కొడతాం. ఆ తరువాత జరిగే పరిణామాలకు కేటీఆరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వెంటనే ఆ ప్రోగ్రామ్ ను క్యాన్సల్ చేయండి’ అని హెచ్చరించారు.

 

 

 

For More News..

ఆదిలాబాద్ లో యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు