బుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు మొరాయించడాన్ని నిరసిస్తూ బుల్లెట్ బండిపై ఆయన అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు గత కొద్ది రోజులుగా మొరాయిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. తనకు కొత్త వాహనం కేటాయించడంలేదని.. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు  చెప్పారు. కాగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ప్రగతి భవన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే కారు వదిలేసి వెళ్లడంతో పోలీసులు దానిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.