కొత్తగూడ, వెలుగు: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కర్నాటకలోని రాయచూర్ రూరల్ బీజేపీ ఎమ్మెల్యే తిప్పస్వామి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో బీజేపీ పార్టీ ఆఫీస్‌ను మంగళవారం ములుగు జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు రాంచందర్రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత మోదీదన్నారు.
.ములుగులో రూ.900 కోట్లతో గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. నవంబర్ 15న ఆదివాసీ గౌరవ దివాస్‌గా నిర్వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మవద్దని సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.