తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలి

  • ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో వివిధ రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు

వెలుగు నెట్‌‌వర్క్‌‌ : బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యే ప్రవాస్‌‌ యోజన కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కర్నాటక రాష్ట్రం హుబ్లీ ధార్వాడ్‌‌ ఎమ్మెల్యే మహేశ్‌‌ తంగినకై, భూపాలపల్లిలో సౌత్‌‌ గోవా ఎమ్మెల్యే ఉల్లాస్‌‌ తుయోంకర్‌‌, వరంగల్‌‌ తూర్పు నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రం బరేలి కంటోన్మెంట్‌‌ ఎమ్మెల్యే సంజీవ్‌‌ అగర్వాల్‌‌, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌లో కర్నాటక రాష్ట్రం ఖుందుగోడ్‌‌ ఎమ్మెల్యే ఎంఆర్‌‌. పాటిల్‌‌, భీమదేవరపల్లిలో ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రం మహోళి ఎమ్మెల్యే శశాంత్‌‌ త్రివేది, ములుగులో ఒడిశా రాష్ట్రం పార్లకేముడి ఎమ్మెల్యే కొడూరు నారాయణరావు, వరంగల్‌‌ పశ్చిమ నియోజకవర్గంలో తమిళనాడు రాష్ట్రం మొదక్కురిచి ఎమ్మెల్యే సికే.సరస్వతి, మరిపెడలో ఒడిశా రాష్ట్రం సరిస్క ఎమ్మెల్యే భూదాన్‌‌ ముర్ము పర్యటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌‌ కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేంద్రం పేదల కోసం 4 కోట్ల ఇండ్లు కడితే రాష్ట్రంలో కేసిఆర్‌‌ సర్కార్‌‌ కనీసం లక్ష ఇండ్లు కూడా కట్టలేకపోయిందన్నారు. ఆయుష్మాన్‌‌ భారత్‌‌ పథకాన్ని తెలంగాణలో పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మిగులు బడ్జెట్‌‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వాటిని కాగితాలకే పరిమితం చేశారన్నారు.

సీఎం కేసీఆర్‌‌ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. తొర్రూరులో పూసాల శ్రీమాన్‌‌, పెదగాని సోమయ్య, లేగా రాం మోహన్‌‌రెడ్డి, భూపాలపల్లిలో చందుపట్ల కీర్తిరెడ్డి, కన్నం యుగంధర్, చాడ రఘునాథరెడ్డి, వరంగల్‌‌లో పొట్టి శ్రీనివాస్ గుప్తా, ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు, కుసుమ సతీశ్‌‌బాబు, ఘన్‌‌పూర్‌‌లో గుండె విజయరామారావు, ఆరుట్ల దశమంతరెడ్డి, మాదాసు వెంకటేశ్,

భీమదేవరపల్లిలోబొమ్మ శ్రీరాం చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్‌‌రెడ్డి, కోమటిరెడ్డి రాంగోపాల్‌‌రెడ్డి, ములుగులో చింతలపూడి భాస్కర్‌‌రెడ్డి, అజ్మీర కృష్ణవేణి నాయక్, నగరపు రమేశ్‌‌, హనుమకొండలో రావు పద్మ, మార్తినేని ధర్మారావు, రావుల కిషన్, మరిపెడలో గూగులోతు దేవికా శంకనాయక్‌‌, చీకటి మహేశ్‌‌గౌడ్‌‌, గుగులోత్‌‌ లక్ష్మణ్‌‌ నాయక్‌‌ పాల్గొన్నారు.