బీజేపీ అగ్ర నేతలను కలిసిన కొత్త ఎమ్మెల్యేలు

నిర్మల్/ ఆదిలాబాద్​ టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో ఇటీవల గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్​శంకర్, ఏలేటి మహేశ్వర్​రెడ్డి ఆ పార్టీ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఢిల్లీలో తరుణ్ చుగ్, బీఎల్ సంతోష్ తోపాటు ఆ పార్టీ తెలంగాణ​ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా వారిని అగ్ర నేతలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో చర్చించినట్లు పేర్కొన్నారు.