నేడు హెచ్​సీయూకు బీజేపీ ఎమ్మెల్యేల టీమ్

నేడు హెచ్​సీయూకు బీజేపీ ఎమ్మెల్యేల టీమ్
  • కంచెగచ్చిబౌలి భూముల ఇష్యూపై నిజనిర్ధారణ కమిటీకి నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కంచెగచ్చిబౌలి భూముల ఇష్యూపై  మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీని సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు ఎమ్మెల్యేల బృందం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ సీయూ కు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారంతా బయలుదేరుతారు. 

బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్​సీయూ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆందోళనకు బీజేపీ ప్లాన్​చేస్తోంది. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం అంశంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి వేయాలని ప్లాన్ చేస్తోంది.