ఇయ్యాల సుంకిశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు

ఇయ్యాల సుంకిశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: నల్లగొండ జిల్లా సుంకిశాల ప్రాజెక్టును మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కలిసి ప్రాజెక్టు వాల్ కూలిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరనుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. 

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నాసిరకం పనులు చేపట్టారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టును నిర్మించిన  మెఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.