
ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని గురువారం (మార్చ్ 27) లోక్ సభలో డీప్ ఫేక్ దుర్వినియోగం గురించి మాట్లాడుతూ సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా జీరో అవర్ లో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వీటి వలన సినీ సెలెబ్రెటీలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే కొందరు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తూ సినీ సెలెబ్రెటీల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నారని వీటిని అరికట్టాలని అన్నారు.
ఇక సినీ సెలెబ్రెటీలు చాలా కష్టపడి పని చేస్తూ స్టార్డమ్ తెచ్చుకుంటుంటారని కానీ డీప్ ఫేక్ కారణంగా వారి ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేగాకుండా ఫేక్ వీడియోలు, ఫోటోల మార్ఫింగ్ వంటివి చేయడంతో చాలా మంది బలైపోతున్నారని వాపోయారు. ఈ ఇలాంటి వాటివల్ల మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను తేలికగా తీసుకోకూడదని కోరారు.
ఈ విషయం ఇలా ఉండగా సినిమాల్లో నటించేప్పుడు ఎంతోమంది డ్రీమ్ గర్ల్ గా ఉన్నటువంటి నటి హేమ మాలిని రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బీజీపీ పార్టీలో చేరి ప్రజా సమస్యల తరుపున పోరాటం చేస్తున్నారు. 2004లో అధికారికంగా బీజేపీ పార్టీలో చేరిన హేమ మాలిని రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. సినిమాల్లో ప్రతిష్టాత్మకంగా అందించే పద్మశ్రీ అవార్డుని కూడా అందుకుంది.