బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

ఆదిలాబాద్​టౌన్/ నస్పూర్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనికి బాధ్యత వహిస్తూ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏఐటీయూసీ, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్​ ముందు ధర్నా చేపట్టారు. ఉమ్మడి జిల్లా ప్రజలు బీజేపీ నుంచి ఓ ఎంపీని, నలుగురు ఎమ్మెల్యేలను గెలిపిస్తే కేంద్రం చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయారని మండిపడ్డారు.

వెంటనే వారు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. జిల్లాలో టెక్స్​టైల్​ పార్క్​, విమానాశ్రయం, మూతబీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలిపడ్డ సిమెంట్​ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తామని చెప్పిన బీజేపీ లీడర్లు సమాధానం చెప్పాలన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మికులు, సీపీఐ, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పెట్టుబడి దారులకు అనుకూలంగా బడ్జెట్

పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్ ఉందని సీఐటీయూ లీడర్లు మండిపడ్డారు. శ్రీరాంపూర్ ఓసీ వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇస్తూ పేదలకు కొర్రీలు పెడుతోం దని మండిపడ్డారు.

ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేలా, ఆదానీ అంబానీలకు రెడ్ కార్పెట్ తో బీజేపీ స్వాగతం పలికిందని ఆరోపించారు. సీఐటీయూ మండల కన్వీనర్ రాజేశం, శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి మహేందర్,  సమ్మయ్య, అశోక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.