పసుపు బోర్డు తన రాజకీయ జీవితానాకి ఓ పునాదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. మెట్పల్లి పట్టణంలో పసుపు రైతుల కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. పసుపు బోర్డు వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రధాని మోదీకి పెద్ద అభిమానినని తెలిపారు. మళ్లీ తనని గెలిపిసై మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేసి చెరుకు రైతులకు పూర్వ వైభవం తీసుకు వస్తానన్నారు. ఈ సందర్భంగా చెరుకు రైతు మామిడి నారాయణ రెడ్డికి పాదాభివందనం చేశారు అరవింద్.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. 2014లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన కవిత.. లిక్కర్ బోర్డు తెరిచిందని తెలిపారు. గతంలో కవిత తనని చెప్పుతో కొడతానని అందని కానీ తాను అందనన్నారు. రాజకీయంగా తనను ఎవరూ అందుకోలేరని చెప్పారు.
రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా నడుస్తోందని చెప్పిన అరవింద్.. ఇందుకోసమేనా బీఆర్ఎస్ కు ఓటు వేసేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే కొడుకు,బిడ్డను చంపుకున్నటేనని ఆరోపించారు. ప్రజలు అవినీతికి తావు లేని పార్టీని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.