సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యులుగా లోక్ సభ ఎంపీలు ధర్మపురి అర్వింద్ ను నియమితులయ్యారు. ఆయనతో పాటు బాలశౌరి వల్లభనేనికి అవకాశం కల్పిస్తూ పార్లమెంట్ బులెటిన్ విడుదల చేసింది. స్పైస్ బోర్డు సభ్యునిగా ఎన్నికవ్వడంపై ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. పసుపు, మిర్చి రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. బోర్డు సభ్యునిగా తన ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. 

గత 35 ఏళ్లలో రానంత బడ్జెట్ను (రూ.30 కోట్లను) మూడేళ్లలో తెచ్చుకున్నామని అర్వింద్ ప్రకటించారు. మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ‘రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్’ మంజూరు చేసిందని, అందుకోసం 2022–2025 మధ్య కాలానికి రూ. 30 కోట్ల బడ్జెట్ ఆమోదించిందని చెప్పారు.  ఆ నిధుల్లో ఇప్పటికే రూ. 9 కోట్ల విడుదల అయ్యాయని తెలిపారు.