నిజామాబాద్ ప్రజలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు జీవిత బీమా చేస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం పక్క.. కాంగ్రెస్ మూడో స్థానంకే పరిమితం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డిచ్ పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ 2014,2018,2023లలో ఎన్నికల మేనిఫెస్టోను చింపేశారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల ప్రస్తావన లేదన్నారు అర్వింద్. నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో లక్ష ఎకరాల సాగునీరు ఎక్కడని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి గ్రామానికి 15 వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. సారంగపూర్ కో-ఆపరేటివ్ చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ధరణిని రద్దు చేస్తామని చెప్పారు. తెలంగాణ యూనివర్సిటీని బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని అర్వింద్ ఆరోపించారు. ప్రొఫెసర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఎక్కడని మీ ఎమ్మెల్యే ను నిలదీయాలని ప్రజలకు సూచించారు.